
నేను రాసిన మొదటి కవిత ఇది. నేను అప్పుడు 9th class.
చెన్నకేశవ రెడ్డి సర్ దేశం గురించి చెప్పినప్పుడు మనసు స్పందించి రాసిన కవిత.సర్ చెప్పే మాటలకు మాకు ఎంతో శక్తి వచ్చిందనిపించేది. మనం పుట్టిందే దేశసేవకని అనిపించేది ఇదే నా కవితలకు నాంది.
మనసులో (28/7/1985)
ఎందుకో కరుగుచున్నది నా గుండె
ఏమిటో పలుకుచున్నది నా హృదయం
ఏదో వెదకుచున్నది నా మనసు
మరి ఇదంతా ఏమిటో తెలుసా...
ఝాన్సీ లా ఉండాలని
రుద్రమలా నిలవాలని
సరోజినిలా వెలగాలని
పలుకుచున్నది నా హృదయం
మనకు దేశమేమి చేయుచున్నది
అని కాదోయ్ మనమనవలసింది
దేశానికి మనమేమి చేయుచున్నాము
ఇలా తలంచాలి ప్రతి పౌరుడు
దేశమంటే మనమందరం
మనమంతే సొదరి సోదరులం
కలగాలోయ్ ఈ భావన అందరిలో
దేశాభివృద్దికి పాటుపడాలి.
స్నేహం (6/9/1985)
నా స్నేహితురాలు ధనలక్ష్మి.తనంతే నాకు చాలా ఇష్టం. తనకి అంతే.తప్పటడుగు వేసిన రోజు తట్టి లేపి చెప్పింది.ఆ స్నేహం కలకాలం నిలవాలనుకున్నా ... 1984 లో కుదిరిన మా స్నేహం ఇప్పటికీ అలానే కొనసాగుతుంది.
నాకు ఇంకొక మంచి స్నేహితురాలు జ్యోతి.
తను నాకు ఇంటర్ నుంచి ఫ్రెండ్. నా సంతోషాన్ని పంచుకుని రెట్టింపు చేసింది. బాధలో ఉన్నప్పుడు....అప్పుడు కూడా బాధ తెలియకుండా సంతోషాన్నె ఇచింది.నా జీవితాన్నే చూపించింది...తనతో స్నేహం కుడా ఇంకా కొనగుతునె ఉంది......
ఇష్టమైనది కష్టమైనా ఒదలలేను నేను.
నాకు ఇంకొక మంచి స్నేహితురాలు జ్యోతి.
తను నాకు ఇంటర్ నుంచి ఫ్రెండ్. నా సంతోషాన్ని పంచుకుని రెట్టింపు చేసింది. బాధలో ఉన్నప్పుడు....అప్పుడు కూడా బాధ తెలియకుండా సంతోషాన్నె ఇచింది.నా జీవితాన్నే చూపించింది...తనతో స్నేహం కుడా ఇంకా కొనగుతునె ఉంది......
ఇష్టమైనది కష్టమైనా ఒదలలేను నేను.
ఇలా జీవితకాలం .....................
స్నేహమెంత మధురమన్న
స్నేహమెంత తీపిరన్న
ఎంతున్నా ఏ మున్నా
స్నేహాన్ని మరువకన్న
ఎవరు ఏమి అన్నా
ఎందుకా చింతన్నా
స్నేహమున్నదన్నా
చింతలు మరువన్నా
ఇలలో ఏదీ ఉన్నా
స్నేహం కావాలన్నా
కష్ట సుఖాలున్నా
స్నేహాన్నీ మరువకన్న
నీకయినా అన్నా
నాకయినా అన్నా
మించిందే లేదన్నా
స్నెహంకంటే మిన్నా
మల్లెలన్న మాయునన్న
మంచైనా కరుగునన్న
మాయందీ స్నేహమన్న
కరగందీ స్నేహమన్న
తరగందీ స్నేహమన్న
స్నేహమె కావాలన్నా.
పవిత్ర దేశం (9/9/1986)
ఈ దేశం చుడరా
పవిత్ర దేశం చూడు
ఇది మన దేశం చూడు
ఇది ఘన దేశం చూడు
పుణ్య మూర్తుల దేశం చూడు
ఆదర్శ మూర్తుల దేశం చూడు
వీర నారుల దేశం చూడు
దేశ భక్తుల దేశం చూడు
పుణ్య నదమ్ముల్ల దేశం చూడు
పంట చేల ఈ దేశం చూడు
ప్రకృతితో ఈ దేశం చూడు
సౌందర్యపు ఈ దేశం చూడు
ఇదే ఇదే మన దేశం చూడు
ఇదే ఇదే భరత దేశం చూడు.
ప్రకృతి దేశం (9/9/1986)
ఈ దేశం మనదేశం
మనదేశం మన భారతదేశం
రత్నరాసులతొ ఈ దేశం
తులతూగినదీ సిరిదేశం
పైరు పంతలతొ ఈ దేశం
పచ్చగ మెరిసెను ప్రకృతి దేశం
వేదయగ్నాలతో ఈ దేశం
వేదాంగమాయె పవిత్ర దేశం
నవరసములతో ఈ దేశం
నాట్యం చేసెను ఘన దేశం
రణ వేరులతో ఈ దేశం
రణ రంగమాయె వీర దేశం
స్వాతంత్ర్యముతో ఈ దేశం
పవిత్రమాయె ప్రియ దేశం
ఇదె ఇదే మా దేశం
ఘనమైనది మా దేశం
ప్రియమైనది మా దేశం
ఇది మా భారతదేశం
భారత మాత
పవిత్ర భారత మాతని చూడు
అందమైన భరత మాతని చూడు
బంగరు భూమి చీరగా
పైరు పంటలే అంచుగా
పల్లెటూళ్ళే పల్లవిగా
మురిసిపోతోంది మా తల్లి
హిమాలయాలే కిరీతముగా
ఫుణ్యనదమ్ములె హారముగా
నవధాన్యాలే మువ్వలుగా
నడచివస్తోంది చల్లని తల్లి
ధైర్యమునిచ్చి అభయమిచ్చు
వీరనారులను చూచి
నారీమణులను కాంచి
ముసి ముసిగా నవ్వుతోంది
భారత మాత.
పల్లె సీమ

అవే అవే నీలికొండలు
అచతే ఉన్నది కోనేరు
ఆప్రక్కనే పంటచేలు
అదే అదే మా పల్లెటూరు
కోకిల పాత వినగా
మనసే పులకించగా
నెమలి నాట్యం చేయగా
ఆనందం తాండవించెగా
పల్లెటూళ్ళే చూడగా
అనురాగం పొంగిపొరలెగా
నీలి నీలి ఆకాశంలో
పున్నమి చంద్రుని వీరవిహారం
పున్నమి చల్లని వెన్నెలలో
తారా తారా నాట్య విహారం
అందమైనది ఈ పల్లెసేమ
ఆనందం కొల్పు ఈ పల్లెసీమ
స్వార్ధ చింతనే లేని సీమ
హాయిని కూర్చు ఈ పల్లెసీమ
Meeloni deesa bhakthi ki naa jooohar. Mee friendship kalakaalam niluvaalani asistunnanu.
ReplyDeletemi comments li thanks ......
ReplyDelete