Saturday, December 17, 2011

అంతులేని ఆందోళన .....





ఆదమరచి ఉన్న నా మది భవిష్యత్తు  లోకి వెళ్ళి
అంబరాన్ని చుంబించే నా ఆలోచనలు
అనంత వీధుల్లో ఆడుతూ పాడుతూ ..........
అమాంతంగా కొండమీంచి కిందకి జారిన రాయి వేగాన 
ఆనందాన్ని అనుభవించలేని అడ్డంకుల గతం లోకి వెళ్ళి 
ఆగుతూ.... ఆగుతూ..... అన్నిటినీ నెమరు వేస్తూ వచ్చి
ఆగు ఆగు అంటూ ప్రస్తుతం లో ఆగి పోయి 
ఇది నీ జీవితం........ ఇదే నీ జీవితం అంటూ అపేసరికి ....
భూత ,భవిష్యత్, వర్తమనాలలోనికి ఒక్కసారిగా ...
వెళ్ళిన నా మనసుకి అంతులేని ఆందోళన .....
ఈ ఆందోళన తీర్చే వారెవరనే ఆరాటాన్ని 
ఆపద్భాందవుడయిన భగవంతుని ఆలోచన ఆపివేసింది 
ఆలోచనలన్నీ అలల్లాగా మెల్లగా అదృశ్యమయి పోయాయి 
భగవంతుడు ఉన్నాడనే నా నమ్మకం మరోసారి రుజువయింది

Monday, August 8, 2011

విన్నపం




జీవితాంతం తోడు కావాలని
జీవితాన్నే ఇచ్చిన తల్లిని కాదని
ఇది విధి ఆడే వింత నాటకమని      
బూటకపు మనసుల బాటలో మనం....


తన పిల్లల తల్లి కోసం తనే
తల్లికి దూరమైన పిల్లలెందరో....
తల్లినిమరిచి పెళ్ళాం తో సరసాలిక్కడ
పిల్లల సంతోషాన్ని తలచుకొనే తల్లి ఎక్కడ..


నలభైలో కూడా పిల్లలకోసం అంటూ పెళ్ళాంతో బాస..
అరవైలోని తల్లి ఒంటరిపోరాటంలో బతుకంతా బానిస..
అమ్మా నన్ను క్షమించు అన్న మనసులేని మాటలెక్కడ...
తల్లీ నీకు జోహార్లు అనే మాటలని దాచుకున్న ఓ మనసా నీవెక్కడ.....??


సంతోషాలు సరసాల మద్య కాలమిలా ఆగిపోనీ.....
అని కలలు కనే పిల్లలిక్కడ
బ్రతుకు పయనపు మజిలీలని తలుచుకుంటూ
చివరి మజిలీకోసం ఎదురు చూసే తల్లిదండ్రు లెక్కడ...??


అందరూ కలిసి సంతోషంగా జీవించే
మనశ్శక్తిని ప్రజలకి ప్రసాదించు ప్రభూ........
 
 

Friday, April 29, 2011

నేనెవరిని

నీ ఊహల్లో నా ఊసుందా
నీ పాటల్లో నాపలుకుందా
నీ మనసులో నా మాటుందా
నీ ఆలోచన అడవుల్లో
నా అడుగుల జాడుందా
ప్రియతమా నేనెవరిని నీమనసులో.....
ప్రాప్తం లేని నీప్రేమకు లిప్త కాలం
కూడా గుర్తురాని గడ్డిపువ్వుననుకుంటా......

తోడు

బ్రతుకు పయనంలో అలసినట్టుంటే
విశ్రాంతిగా నీ తోడుకోరాను
నిన్ను కలవలేని మన మద్య
మైళ్ళ దూరంలో... మైలు కొక మజిలీ ...
మజిలీకొక మైమరపు అయినా....
మనసారా నను పిలిస్తే ..
మరునిముషం నీ ముందుండనా....

అయినా.........

మరువలేని మాటలని
చెరిగిపోని చేతలని
నీ ఊహల ఊసులని
బరువైన భావాలని
జ్ఞాపకాల గ్రంధంలో
అంతరంగ మధనంతో
నా మనసుముసుగు మాటున
మధన పడుతూ మట్టికప్పా.....
అయినా..........
మట్టిచీల్చుకువచ్చిన నా
మనసు మాట విననంది....???