Saturday, April 16, 2011

పొరపాటో...గ్రహపాటో....


పొరపాటో...గ్రహపాటో....

అభిమానం ఆత్మీయత అంచలంచలుగ
కంచలు దాటి సంచరించే వేళ ......

నిను చూసిన నాకన్నులు ...... నీకు
నేనంటే అభిమానం, నేనంటే ఆత్మీయత
నేనంటే అనురాగం అంతుకేని ప్రేమనుకుని
అలలై ఎగిసేలా అపోహ పడ్డాయి

అణువణువున నినువెదికే నా హృదయం
ఓదార్చీ... ఒడిచేర్చీ, సేదదీర్చి..... చేరదీసి
నీ బాహువు బిగువులలో బాధ భారం తీరునని
ఉప్పొంగే నా హృదయం ఊరట ఊహించింది .....
అన్నీ భూటకమని.., అన్నీ నాటకమని
ఏ దినం కాంచిన నా కన్నులు....
అశ్రుసంద్రాలయినాయి .........
అది తెలిసిన నా ఎదకి మిగిలింది ఇక వ్యధే.....

No comments:

Post a Comment